Friday, 9 July 2021

Laal Singh Chaddha : ఆమిర్ ఖాన్‌తో నాగ చైతన్య.. షూటింగ్‌లో ఫుల్ హల్చల్!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేం. ఒక హీరో చేయాల్సిన పాత్రలు మరో హీరోకు వెళ్తుంటాయి. అలా తాజాగా నాగ చైతన్యకు మంచి ఆఫర్ వచ్చింది. హిందీలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంత బాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు సైతం బాలీవుడ్‌లో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాత్ర అంతకు ముందు విజయ్ సేతుపతికి ఆఫర్ చేశారు. ఆయన కూడా అంగీకరించారు. కానీ కరోనా వల్ల డేట్స్ అన్నీ తారుమారయ్యాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నారు. అలా ఈ క్యారెక్టర్ నాగ చైతన్యకు దక్కింది. ఇప్పుడు నాగ చైతన్య ఆమిర్ ఖాన్‌తో కలిసి సెట్‌లో సందడి చేస్తున్నారు. ఈ మేరకు నాగ చైతన్య ఓ ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం సినిమా యూనిట్ లఢఖ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడే ఓ ఇరవై రోజులు పాటు యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించబోతోన్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం నాగ చైతన్య లుక్కును మార్చేశారు. క్లీన్ షేవ్‌తో కనిపించి చాలా కాలమే అయింది. లవ్ స్టోరీ, థ్యాంక్యూ సినిమాల్లో నాగ చైతన్య గడ్డంతోనే కనిపిస్తారు. ఇలా మొత్తానికి నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ గట్టిగానే జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hMGKE6
v

No comments:

Post a Comment