Thursday, 8 July 2021

Krithi Shetty: 'ఉప్పెన' బ్యూటీ పర్ఫార్మెన్స్‌ చూసి నాగార్జున ఫిదా.. కృతి శెట్టికి బంపర్ ఆఫర్!

తొలి సినిమా తోనే యూత్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకుంది కృతి శెట్టి. పెద్దగా అందాల ఆరబోతకు తావివ్వకుండా 'ఉప్పెన' మూవీలో నాచురల్ నటనతో ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఈ ముద్దుగుమ్మపై పడింది. ఈ నేపథ్యంలోనే పర్ఫార్మెన్స్‌ చూసి ఫిదా అయిన .. ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చారనే న్యూస్ వైరల్ అవుతోంది. అక్కినేని నాగార్జున- కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబోలో గతంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వల్‌గా రాబోతున్న 'బంగార్రాజు' మూవీలో కృతి శెట్టిని తీసుకున్నారట. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించిన చర్చలు నడుస్తున్నప్పటికీ ఇంకా సెట్స్ మీదకు రాలేదు. దీంతో అతిత్వరలో సెట్స్ మీదకు రావాలని ఫిక్స్ అయిన నాగార్జున ఇందులో ఓ హీరోయిన్‌గా కృతి శెట్టి పేరును రెఫర్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక మూవీలో కూడా భాగమవుతున్నారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుండగా.. నాగ చైతన్య జంటగా కృతి శెట్టి నటించనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ రోల్ కోసం కొందరు హీరోయిన్లను పరిశీలించిన టీమ్.. నాగార్జున సూచన మేరకు కృతి శెట్టి వైపు మొగ్గు చూపుతున్నారట. అతిత్వరలో ఇందుకు సంబంధించి అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే కృతి శెట్టి కెరీర్‌కి ఇది మంచి బూస్టింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు నాని హీరోగా తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో బిజీగా ఉన్న కృతి శెట్టి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కి జోడీగా మరో సినిమాకు సైన్ చేసింది. దీంతో పాటు యంగ్ హీరో నితిన్ సరసన మరో సినిమాలో ఆమెను ఫైనల్ చేశారని తెలుస్తోంది. సో.. ఆమె వరుస ఆఫర్స్ చూస్తుంటే అతిత్వరలో కృతికి స్టార్ డమ్ పట్టేస్తుందేమో అనిపిస్తోంది కదూ!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36idjVc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...