Thursday, 8 July 2021

Aadi Saikumar : పాయల్‌తో రొమాన్స్‌కు రెడీ.. రంగంలోకి దిగనున్న ఆది

లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ కాంబినేషనల్‌లో కిరాతక సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఈ మూవీకి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ మధ్యే హీరో హీరోయిన్ల మీద రొమాంటిక్ ఫోటో షూట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలను రిలీజ్ చేస్తూ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో కిరాతక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు `కిరాతక` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది. ఈ సంద‌ర్భంగా పాయ‌ల్ రాజ్‌పూత్ మాట్లాడుతూ.. నేను ఇప్ప‌టివ‌ర‌కు చాలా క‌థ‌లు విన్నాను..కాని ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌ నాకు బాగా న‌చ్చింది.పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌. అలాగే ఆదితో ఫ‌స్ట్ టైమ్ న‌టిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌, నిర్మాత నాగం తిరుపతిరెడ్డికి స్పెష‌ల్ థ్యాంక్స్‌ అని అన్నారు. నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. మా విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.3గా `కిరాత‌క` చిత్రం రూపొందుతోంది. మా హీరో ఆది, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌ హిట్ కాంబినేష‌న్ లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వీర‌భ‌ద్ర‌మ్ చెప్పిన క‌థ బాగా న‌చ్చి పాయిల్ రాజ్‌పూత్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తాం అనే న‌మ్మ‌కం ఉంది. త్వ‌ర‌లో గ్రాండ్ ఓపెనింగ్ జ‌రిపి ఆగ‌స్ట్ 13నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్ర‌మ్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఆర్టిస్టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఆది ఇంత వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. `కిరాత‌క` క‌థ న‌చ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో న‌టించ‌డానికి పాయ‌ల్ రాజ్‌పూత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్ట‌ర్ కూడా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో నాగం తిరుప‌తి రెడ్డి అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TFj4cX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...