Friday, 23 July 2021

HBD Suriya: ‘జై భీమ్’ అంటున్న సూర్య.. ఇది కదా అభిమానులు ఎదురుచూసే ఫస్ట్‌లుక్

నేరుగా తెలుగులో సినిమాలు చేయనప్పటికీ.. డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు సూర్య. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. తమిళనాడులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోలలో ముందు వరుసలో ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాగా, శుక్రవారం (జూలై 23న) సూర్య తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకూ ప్రతీ ఒక్కరు సూర్యకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాక.. సూర్య ప్రస్తుతం నటిస్తున్న సినిమాల నుంచి అప్‌డేట్ కూడా ఇస్తున్నాయి చిత్ర యూనిట్‌లు. తాజాగా తన కెరీర్‌లో 39వ సినిమా ‘జై భీమ్’ టైటిల్‌, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని సూర్య స్వయంగా విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనున్నారని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.. టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో సూర్య చేస్తున్న నాలుగో చిత్రం ఇది కావడం మరో విశేషం. ప్రస్తుతం ఈ ఫస్‌లుక్‌ పోస్టర్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. లాయర్ పాత్రలో సూర్యని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kL0Dyn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...