Tuesday, 13 July 2021

రామ్ రెమ్మ్యూనరేషన్‌పై ఓ రేంజ్ చర్చలు.. ఎనర్జిటిక్ స్టార్ అన్ని కోట్లు ఛార్జ్ చేస్తున్నాడా? రియల్లీ షాకింగ్

కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో తన రేంజ్ రెట్టింపు చేసుకున్నారు. పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడమే గాక రామ్ కెరీర్‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. క్లాస్, మాస్ ఆడియన్స్ రామ్ నటనకు ఫిదా అయ్యారు. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ఇదే సరైన సమయం అని భావించి తన రెమ్మ్యూనరేషన్‌ అమాంతం పెంచేశారట రామ్. తాజాగా తన 19వ సినిమాగా తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయబోతున్న సినిమా కోసం ఆయన 13 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. గతంలో ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు తీసుకునే రామ్‌ ఒక్కసారిగా 3 కోట్లు పెంచేశాడని తెలుస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే హీరో రామ్ ఈ రేంజ్‌లో రెమ్మ్యూనరేషన్ అందుకోవడంపై చర్చలు ముదిరాయి. RAPO 19 పేరుతో రామ్- లింగుస్వామి కాంబో సెట్స్ పైకి వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ ఎనర్జీని పీక్ లెవెల్‌లో చూపించబోతున్నారట లింగుస్వామి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yTBs0v
v

No comments:

Post a Comment