Tuesday, 13 July 2021

హీరోతో గడపడం తప్పనిసరి! డైరెక్టుగా అడిగేవారు.. తెరవెనుక బాగోతలంటూ బోల్డ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. 'మీటూ' ఉద్యమం రావడం ఎన్నో నిజాలను బట్టబయలు చేసింది. ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమ ప్రభావం క్రమంగా బాలీవుడ్‌లో ప్రవేశించి సంచనల విషయాలను వెలుగులోకి తెచ్చింది. మరోవైపు అంటూ శ్రీ రెడ్డి చేసిన ఉద్యమం కూడా ఎంతో హీరోయిన్లను వెన్నుతట్టి తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టేలా చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనే అంశంపై రియాక్ట్ అవుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది బోల్డ్ బ్యూటీ . 2004 సంవత్సరంలో వచ్చిన ‘మర్డర్‌’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైంది మల్లిక. ఇందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అయితే తెరవెనుక చనువుగా ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని, తన ప్రతిభకు తగిన అవకాశాలు ఇవ్వలేదని గతంలోనే వెల్లడించిన మల్లికా.. మరోసారి అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓపెన్ అయింది. ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పిన మల్లికా శెరావత్.. కొందరు హీరోల కోరికలు తీర్చలేదని అవకాశాలు రాకుండా చేశారంటూ సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్‌ ఆరంభంలో మీడియా ప్రభావం పెద్దగా లేదని, అప్పట్లో ఓ నటి నిలదొక్కుకోవాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అన్నట్లు ఉండేదని ఆమె చెప్పింది. కావాలని బోల్డ్‌ సీన్లు పెట్టేవారని చెప్పిన ఆమె.. కెమెరా ముందు రొమాంటిక్‌గా చేసినప్పుడు నిజ జీవితంలో ఎందుకు కుదరదు? అని అడిగిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారని చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి వాటికి తాను దూరంగా ఉండటం వల్లనే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని మల్లిక చెప్పడం గమనించాల్సిన విషయం. అంతేకాదు ఇండస్ట్రీలో నేటికీ అక్కడక్కడా అదే ధోరణి కనిపిస్తోందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనకు ‘బోల్డ్ నటి’ అని పేరు రావడానికి కారణం కూడా తోటి నటీనటులే అని మల్లిక శెరావత్ చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wEnJcz
v

No comments:

Post a Comment