Thursday, 15 July 2021

ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్.. ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ హీరో

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనే మాట మనందరికీ తెలిసిందే. అలాగే ఒక సినిమా కూడా మన రేంజ్‌ని ఎక్కడికో తీసుకువెళ్తుంది అనడానికి యంగ్ రెబల్ స్టార్ ఓ ఉదాహరణ. జక్కన రాజమౌళీ దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ అనే చిత్రంతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్‌గా ఎధిగిపోయాడు. ప్రస్తుతం అతను చేస్తున్నవి అన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులే.. అందులో దర్శకత్వంలో రూపొందుతున్న ‘’ ఒకటి. రామాయణ గాధ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. ప్రతినాయకుడు రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. సీత పాత్రలో , లక్షణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరో ముఖ్యపాత్ర కోసం సీనియర్ హీరోయిన్ కాజోల్‌ని తీసుకున్నారని సమాచారం. ఇక ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు వత్సల్ సేథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఆయన టార్జాన్ ది వండర్ కార్, సల్మాన్ జైహో, తాజాగా మలాంగ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆదిపురుష్‌లో ముఖ్య పాత్ర చేస్తున్నారు. ‘కొత్త ఆరంభం.. #ఆదిపురుష్’ అంటూ వత్సల్ సేథ్ ట్వీట్ చేశారు. దర్శకుడు ఓం రౌత్‌ని కూడా ఇందులో ట్యాగ్ చేశారు. దీంతో వత్సల్ ఈ సినిమాలో ఏ పాత్రో కనిపించనున్నారా.. అనే ఆసక్తి ప్రతీ అభిమాని మదిలో ప్రారంభం అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kmc1R3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...