Thursday, 15 July 2021

సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో శర్వానంద్ 30వ సినిమా.. ‘ఒకే ఒక జీవితం’ ప్రోమో విడుద‌ల‌

సినిమా, సినిమాకి వేరియేషన్ చూపిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ‘’. ఈ ఏడాది మార్చిలో ‘శ్రీకారం’ అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వ్యవసాయం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. త్వరలో శర్వా.. ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ బాబు. ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. గురువారం ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌కి సంభందించి ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదిని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్‌ట్రూమెంట్స్‌ని చూపించిన తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం మ‌నం చూడొచ్చు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక ఈ సినిమాలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌ హీరోయిన్‌గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి సహాయ పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రేడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్‌ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఒకే ఒక జీవితం’ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hHqqFL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...