Thursday, 8 July 2021

నెరిసిన గడ్డంతో మెగాస్టార్.. ఆ సినిమా కోసమే అలా!.. లీకైన చిరు లుక్

మెగాస్టార్ ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్ట్‌లను రెడీ చేశారు. ఆచార్య షూటింగ్ పూర్తవ్వడంతోనే వెంటనే లూసిఫర్ రీమేక్‌ను మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఆ తరువాత వేదాళం రీమేక్‌ను మెహర్ రమేష్ సిద్దం చేశారు. అటుపై బాబీ దర్శకత్వంలో మరో చిత్రం ఉండబోతోంది. ఇలా మొత్తానికి మంచి లైనప్ పెట్టేశారు. అయితే చిరంజీవి ఇప్పుడు ఇంటి పట్టునే ఉంటున్నారు. సెకండ్ వేవ్ దెబ్బకు షూటింగ్‌లన్నీ కూడా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తూ ఆచార్య టీం ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వచ్చేసింది. అలా ఆచార్య షూటింగ్ మళ్లీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా చిరంజీవి కొత్త లుక్కులో దర్శనమిచ్చారు. తాజాగా తన కొత్త సినిమా సినిమా సింగిల్‌ను రిలీజ్ చేయాల్సిందిగా చిరంజీవిని కోరారు. ఈ మేరకు చిత్రయూనిట్ అంతా కూడా చిరంజీవి ఇంటికి వెళ్లింది. మాస్ కా బాస్ అంటూ అదిరిపోయే మాస్ సాంగ్‌ను చిరు చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని యూనిట్ భావించింది. ఈ క్రమంలో మందులోడా అనే ఈ పాటను చిరు లాంచ్ చేశారు. తాజాగా చిత్రయూనిట్ చిరును కలిసి వీడియోను వదిలారు. ఇందులో చిరంజీవి లుక్కు కాస్తా బయటపడింది. నెరిసిన గడ్డంతో చిరు కనిపించారు. ఇది లూసిఫర్ కోసం ట్రై చేస్తోన్న గెటప్పేనా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఇలా నేచురల్ లుక్‌లో చిరు అదిరిపోయారంటూ కామెంట్లు వస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yDfGy0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...