Thursday, 8 July 2021

Allu Arjun : బన్నీ భార్యా.. మజాకా?.. అల్లు స్నేహారెడ్డి విన్యాసాలకు అంతా షాక్!

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా రూపాంతరం చెందారు. ఇక ఈ ట్యాగ్ మీద ఆల్రెడీ ట్రోలింగ్ కూడా జరిగింది. ఆ విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. సతీమణికి స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో ఏ స్టార్ హీరో భార్యకు లేనంత అభిమాన గణం, ఫాలోవర్ల అల్లు స్నేహారెడ్డికి ఉన్నారు. ఈ మధ్యే ఇన్ స్టాలో నాలుగు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకోవడంతో స్నేహారెడ్డి ఈ ఘనతను సాధించారు. అలా బన్నీకి తగ్గ భార్యగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో దూసుకుపోతోన్నారు. బన్నీ, అర్హ, అయాన్‌లకు సంబంధించిన పోస్ట్‌లు ఎక్కువగా చేయడం, ఎప్పటికప్పుడు అప్డేట్‌లు ఇవ్వడంతో స్నేహారెడ్డికి ఈ రేంజ్ ఫాలోయింగ్ దక్కింది. అలా షేర్ చేసే ఫోటోలు, వేసే సెటైర్లు, చేసే కామెంట్లు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె తనలోని కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు. చాలా రోజుల నుంచి యోగాలో స్నేహారెడ్డి శిక్షణ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇటువంటివన్నీ కూడా మంచు లక్ష్మీ, అదా శర్మ వంటి వారు ఎక్కువగా చేస్తుంటారు. ఇక తాజాగా స్నేహారెడ్డి ఒక్కసారిగా తలకిందులై తన టాలెంట్‌ను బయట పెట్టేడయంతో కళ్యాణ్ దేవ్ షాకైనట్టున్నారు. మొత్తానికి చేసేశావ్ స్నేహా అంటూ చప్పట్లు కొడుతున్న ఎమోజీలను కళ్యాణ్ దేవ్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక బన్నీ ఇప్పుడు పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ మూవీ షూటింగ్ రెండ్రోజుల క్రితమే తిరిగి ప్రారంభమైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yErS1c
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...