Monday, 26 July 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: ఆలియా హాట్ లుక్.. గ్యాంగ్‌తో తమన్నా డ్యాన్స్.. అందుకు అనుష్క శర్మ ఆనందం

హ్యాట్ పెట్టుకొని.. హాట్ లుక్‌లో ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్‌గా మారిపోయింది యువ నటి ఆలియా భట్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్న ఆమె.. దీంతో పాటు ‘గంగూభాయ్ కతియాడి’ అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తోంది. ఇక సోషల్‌మీడియాలో ఆలియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా హ్యాట్ ధరించి.. హాట్ లుక్‌లో ఆమె ఓ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. నైట్ డ్రెస్‌లో మ్యాజికల్ డ్యాన్స్ చేసిన నిషా హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ సోదరిగా వెండితెరకు పరిచయం అయిన నటి . పలు హిట్ సినిమాల్లో నటించిన ఆమె.. వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అయితే సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో ఆమె ఎప్పుడు టచ్‌లో ఉంటుంటారు. తాజాగా నైట్‌ డ్రెస్‌లో మ్యాజికల్ డ్యాన్స్ చేస్తూ.. ఓ ఆసక్తికర వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్యాంగ్‌తో కలిసి.. మేకప్ చేసుకుంటూ తమన్నా ఫన్నీ వీడియో.. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అది ఏ సినిమా అయినా తమన్నా స్క్రీన్‌పై కనిపిస్తే చాలు కుర్రాళ్లు ఉర్రూతలు ఊగిపోతారు. ముఖ్యంగా ఆమె గ్లామర్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్‌మీడియాలో తమన్నా చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా తన మిత్రులతో కలిసి.. మేకప్ చేసుకుంటూ.. ఓ స్టెప్ వేసి.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కూతురు ముందు నేను లిల్లిపుట్ అయిపోయా: ఒకప్పటి హీరోయిన్.. ప్రస్తుతం సహాయ పాత్రలు పోషిస్తున్న నటి కుష్బూ సుందర్. సినిమాలతో పాటు.. రాజకీయాల్లో కూడా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొన్ని రోజుల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె.. అందులో ఓటమిపాలయ్యారు. అయితే తాజాగా కుష్బూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ల్ చేశారు. తన కూతురుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్ట్ చేసిన ఆమె.. తన కూతురు ఎంతో ఎదిగిపోయిందని.. ఆమె ముందు తాను లిల్లిపుట్‌లా మారిపోయాను ఆంటూ పేర్కొన్నారు. నవ్వులు చిందిస్తూ.. తను ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పిన అనుష్క నటి .. ఇప్పటివరకూ విలక్షణమైన సినిమాలు చూస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక టీం ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆమె ప్రేమాయణం.. ఆ తర్వాత వారి వివాహం.. ఇలా తరచూ ఏదో ఒక విషయంలో అనుష్క వార్తల్లో నిలుస్తుంటారు. కొద్ది రోజుల క్రితం అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనించారు. ఈ పాపు ‘వామిక’ అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం అక్కడే ఉన్న విరాట్‌తో పాటు అనుష్క కూడా వెళ్లారు. తాజాగా అక్కడ దిగిన ఫోటోలు ఆమె షేర్ చేశారు. ‘ఒక పది వేల అడుగులు.. దాంతో పాటు కొన్ని మంచి ఫోటోలు’ అంటూ ఆమె దీనికి క్యాప్షన్ పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eWlsmV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...