Monday, 26 July 2021

కొందరు రాజకీయ నాయకులు తుగ్లక్‌ వంటి వారు!.. మళ్లీ చిచ్చు పెట్టిన పూనమ్ కౌర్

సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఆమె ఎప్పుడు ఎలాంటి పోస్ట్‌లు వేస్తుంటారో ఎవ్వరూ ఊహించలేరు. ఆమె వేసే పోస్ట్‌లు ఎప్పుడూ కాంట్రవర్సీలకు దారి తీస్తూనే ఉంటుంది. ఆ మధ్య కత్తి మహేశ్‌కు జరిగిన ప్రమాదం వేసిన ట్వీట్, ఆయన మరణాంతరం వేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. కత్తి మహేష్ పేరు ఎక్కడా కూడా ఎత్తకుండానే తనలోని ఆవేదనను బయటపెట్టేశారు పూనమ్ కౌర్. ఆ సమయంలో పూనమ్ వేసిన ట్వీట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను రోజూ చస్తూ బతికాను అని తన బాధను వివరించారు. అలా పూనమ్ కౌర్ వేసే పోస్ట్‌లు ఎప్పుడూ కూడా కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంటాయి. మామూలుగా పూనమ్ కౌర్ ఎప్పుడూ కూడా ఎవరి పేరు పెట్టి నేరుగా ట్వీట్లుగానీ పోస్ట్‌లు గానీ చేయరు. కానీ ఆమె ఎవరిని ఉద్దేశించి అంటున్నారో హింట్లు ఇస్తుంటారు. అలా గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల మీద పరోక్షంగా వేసిన ట్వీట్లు ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా పూనమ్ కౌర్ తనలోని ప్రతిభను చూపించారు. నాలో నర్తకి బయటకు వచ్చింది.. ఒకప్పుడు వారికి నచ్చిన విధానంగా చేశారు.. అవి ఎంతో సున్నితంగా ఉండేవి. వాటిని అందరూ ఇష్టపడేవారు. ప్రేమించేవారు.. అంతే కాకుండా గౌరవించేవారు. అయితే ఇప్పుడు మాత్రం మనమంతా ఎంతో వెనకబడ్డట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చేస్తే అందరూ అదో రకంగా చూస్తుంటారు.. మళ్లీ మనం నాటి యుగానికి వెళ్లగలమా? కానీ తుగ్లక్ పాలన మాత్రం వద్దు. కొంత మంది రాజకీయ నాయకులు ఇప్పుడు తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. ఇక దేవాలయాలపై శిల్పాల మాదిరిగా పూనమ్ పెట్టిన పోజులు వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iNuW54
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...