Friday, 23 July 2021

రాజ్ కుంద్రా వ్యవహారం.. శిల్పా శెట్టి మెడకు బిగుస్తున్న ఉచ్చు!

శృంగార చిత్రాలను నిర్మిస్తున్న కేసులో భర్త అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన వాదనలను కోర్టులో వినిపించారు. తాను నిర్మించినవి పోర్న్ చిత్రాలు కావని చెప్పుకొచ్చారు. అవి అడల్ట్ చిత్రాల కిందకు వస్తాయని, నేరుగా పోర్న్ చిత్రాలు కావని, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67ఏ(అశ్లీల సమాచార ప్రచురణ, ప్రసారం) కింద అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు. దీంతోపాటు తనకు ముందస్తు నోటీసులు ఇచ్చి వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా నేరుగా అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్‌ కస్టడీని విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించారు. అలా రాజ్‌ కుంద్రా బాంబే హైకోర్టు ముందు తన గోడును వెల్లిబుచ్చుకున్నారు. కుంద్రా తన సంస్థ వియాన్‌ ద్వారా ముంబయిలో అశ్లీల చిత్రాలు నిర్మించి బ్రిటన్‌లోని తన బంధువు సాయంతో అక్కడి నుంచి హాట్‌షాట్స్‌ అనే యాప్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారన్న అభియోగాలతో ఈనెల 19న ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీ సంస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రాజ్ కుంద్ర కంపెనీ అయిన ఈ వియాన్ ఇండస్ట్రీలో శిల్పా శెట్టి డైైరెక్టర్‌ మెంబర్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ కేసులో శిల్పా శెట్టి హస్తం ఉందా? లేదా? అనే విషయం మీద పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు శిల్పాశెట్టిని విచారించారు. శుక్రవారం కుంద్రాను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి వెళ్లి శిల్పాశెట్టిని ప్రశ్నించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని వెళ్లారు. అయితే ఈ కేసులో శిల్పా శెట్టి కూడా ఇరుక్కునేలానే ఉంది. రాజ్ కుంద్రా కస్టడీని మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ నెల 27 వరకూ పొడిగించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36X4pN3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...