Friday, 23 July 2021

‘నాకు వెంకటేష్ కనిపించలేదు.. నారప్ప కనిపించాడు’.. ‘నారప్ప’పై చిరు రివ్యు

తెలుగు సినిమాల్లో ఎలాంటి వ్యతిరేకత ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి హీరోలలో ముందు వరుసలో ఉండే వ్యక్తే విక్టరీ వెంకటేష్. ఏ హీరో అభిమానులైనా సినిమా వస్తుంటే.. ఆ థియేటర్ వద్ద సందడి నెలకొంటుంది. అలా వెంకటేష్ సిమిమాలు మనల్ని ఇంతకాలం అలరిస్తూ వచ్చాయి. అయితే ఇంతకాలం క్లాస్ హీరాగా అభిమానులకు పరిచయమైన ఆయన ఒక్కసారిగా మాస్ యాంగిల్‌లో కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. ‘’ సినిమాలో వెంకీని గతంలో ఎన్నడూ చూడని రోల్‌లో చూసి అభిమానులు షాక్ అయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. డి. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. వెంకటేష్ జోడీగా అందాల తార, సీనియర్ హీరోయిన్ నటించింది. రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ బాణీలు కట్టారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాని మెగాస్టార్ అభినందించారు. ‘నారప్ప’ పాత్రలో వెంకటేష్ నటించలేదని.. ఆయన జీవించాడని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘నారప్ప’ పాత్రలో వెంకటేష్ నటించలేదు.. జీవించారు అంటూ మెగాస్టార్ చిరంజీవి కితాబు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రివ్యూ ఇచ్చిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. హీరోల మధ్య ఐకమత్యం అంటే ఇలాగే ఉండాలి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kNNTqJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...