Monday, 19 July 2021

పీవీఆర్ చేతికి ‘మెరిసే మెరిసే’.. జోరు మీదున్న ‘హుషారు’ హీరో

హుషారు, ప్లే బ్యాక్ సినిమాలతో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నారు దినేష్ తేజ్. రెండుచిత్రాలు మంచి విజయం సాధించడంలో దినేష్ పేరు బాగానే వినిపిస్తోంది. ఇక ఇప్పుడు ఆ హీరో అంటూ రాబోతోన్నారు. , శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా 'మెరిసే మెరిసే'. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మెరిసే మెరిసే' చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్ కె మాట్లాడుతూ.. నిర్మాత వెంకటేష్ కొత్తూరి సహకారంతో మెరిసే మెరిసే సినిమాను అనుకున్నట్లుగా తెరకెక్కించాం. ఇటీవలే సెన్సార్ సభ్యులు కూడా సినిమా మీద ప్రశంసలు కురిపించారని మేకర్స్ ప్రకటించారు. క్లీన్ ' యూ ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను విడుదల చేసిన పీవీఆర్ సంస్థ మా మెరిసే మెరిసే సినిమాను రిలీజ్ చేస్తుంటడం సంతోషంగా ఉంది. ఆగస్టు 6న మీ ముందుకొస్తున్నాం. మా సినిమా పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ మెరిసే మెరిసేను హిట్ చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BivGHO
v

No comments:

Post a Comment