Monday, 19 July 2021

మెడికల్ మాఫియాపై సుహాసిని పోరాటం.. 'బలమెవ్వడు'కు ప్రధాన బలం కాబోతున్న సీనియర్ నటి

ఒకానొక సమయంలో తెలుగు, తమిళ చిత్రాల్లో టాప్ రేంజ్ హీరోయిన్‌గా సత్తా చాటింది . దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ మెప్పు పొందుతున్న ఆమె ప్రస్తుతం కథలో ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తూ వస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. గతంలో 'రాఖీ' మూవీలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనకు తెలుసు. ఇప్పుడు అలాంటి మరో అదిరిపోయే పవర్ ఫుల్ పాత్రను '' చిత్రంలో పోషిస్తోంది సుహాసిని. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కన్ఫర్మ్ చేస్తూ ఆమె లుక్ రిలీజ్ చేశారు. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న ఈ 'బలమెవ్వడు' సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో సుహాసిని నటిస్తుండటం సినిమాపై హైప్ పెంచేసింది. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ సినిమాకు సుహాసిని క్యారెక్టర్ ప్రధాన బలం కానుందట. మణిశర్మ బాణీలు కడుతున్న ఈ చిత్రంలో ఫృథ్విరాజ్, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐడ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అతిత్వరలో ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BcyJRT
v

No comments:

Post a Comment