Tuesday, 6 July 2021

వేశ్యగా సోనాక్షి సిన్హా.. ఆయనతో అనగానే వెంటనే ఓకే! బాలీవుడ్ బ్యూటీ డేరింగ్ డిసీజన్

నటీనటులన్నాక కెమెరా ముందు అన్నిరకాల హావభావాలు పలికించవలసి వస్తుంది. పాత్ర పరిధిని బట్టి అందులో ఒదిగిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా అయితేనే వెండితెరపై సుదీర్ఘ ప్రయాణం కొనసాగించడం సాధ్యం. అందుకే నేటితరం నటీనటులు పాత్రల ఎంపిక విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బ్యూటీ ఓ వెబ్‌ సిరీస్‌ కోసం డేరింగ్ డిసీజన్ తీసుకుందని సమాచారం. ఇటీవలే ‘గంగూబాయి కతియా వాడి’ షూటింగ్ కంప్లీట్ చేసిన బాలీవుడ్‌ దర్శకుడు ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ‘’ అనే పేరుతో భారీస్థాయిలో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఆయన పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారు. ఆయన రూపొందిస్తున్న తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే కావడంతో దీనిపై మరింత ఫోకస్ పెట్టి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే హ్యూమా ఖురేషిని ఫైనల్ చేసిన ఆయన, తాజాగా మరో ప్రధాన పాత్ర కోసం సోనాక్షి సిన్హాను కూడా కన్ఫర్మ్ చేశారట. అయితే ఈ వెబ్ సిరీస్‌లో సోనాక్షి సిన్హా పాత్రలో కనించనుందని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. సంజయ్ సినిమా, పైగా ఆ వెబ్ సిరీస్‌లో పాత్ర ప్రాధాన్యం తెలుసుకున్న సోనాక్షి.. ఈ రోల్ చేసేందుకు వెంటనే ఒప్పుకుందట. అంతేకాదు ఈ పాత్ర కోసం కథక్‌ నేర్చుకునే పనిలో పడిందట ఈ ముద్దుగుమ్మ. గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన ‘రౌడీ రాథోడ్‌’లో సోనాక్షి నటించింది. సో.. మళ్లీ ఇప్పుడు ఆమె తీసుకున్న డేరింగ్ డిసీజన్ ఏ మేర క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jLNOU5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...