Tuesday, 6 July 2021

రూమర్స్‌కి చెక్ పెడుతూ రంగంలోకి అల్లు అర్జున్.. రెట్టింపు వేగంతో 45 రోజుల్లో అంతా ఫినిష్!!

స్టైలిష్ స్టార్ మాస్ గెటప్‌లో అలరించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' మూవీ చేస్తున్న ఆయన.. లారీ డ్రైవర్ రాజ్‌గా మునుపెన్నడూ కనిపించని లుక్‌లో వెండితెరపై కనిపించబోతున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే రీసెంట్‌గా షూటింగ్ స్టార్ చేయాలని ప్లాన్ చేయగా కొన్ని అనుకోని కారణాలతో మరోసారి షూటింగ్ వాయిదా వేశారని విన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా అలాంటి రూమర్స్‌కి చెక్ పెడుతూ రంగంలోకి దిగారు అల్లు అర్జున్. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన 'పుష్ప' సినిమా షూటింగ్ మంగళవారం తిరిగి ప్రారంభమైంది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై ప్రస్తుతం సికింద్రాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరిందని, మరో 45 రోజుల్లో 'పుష్ప' మొదటి భాగానికి సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని చిత్ర యూనిట్ అంటోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇకపోతే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు సుకుమార్. చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3k0nSV5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...