Tuesday, 27 July 2021

వెంకీమామ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్.. ఆ పండుగ కానుకగా నెక్ట్స్ సినిమా రిలీజ్

తెలుగు ప్రేక్షకుల్లో ఫ్యామిలీ హీరో అంటే అందరికీ గుర్తుకు వచ్చే పేరు దగ్గుబాటి వెంకటేష్. ఫ్యామిలీ హీరోగానే కాకుండా మాస్ హీరోగానూ తన సినిమాలతో వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టేశారు. ఇక వెంకటేష్ చేసే రీమేక్ సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ హిట్లు అవుతుంటాయి. అందుకే వెంకటేష్ సినిమాలు అంటే అందరు ఆసక్తి కనబరుస్తుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఆయన సినిమాలు చూసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మాస్ సినిమాలు చేయడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. తాజాగా ‘’ అనే సినిమాతో ఆయన మంచి సక్సెస్ అందుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై గ్రాండ్ సక్సెస్ సాధించింది. అయితే ఇప్పుడు వెంకీ మరో బ్లాక్‌బస్టర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘’ సినిమాని ఆయన తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఆయన నటించిన ‘దృశ్యం’ సినిమా మలయాళంలో ఏ రేంజ్‌లో హిట్ సాధించిదో.. తెలుగులోనూ అదే రెస్పాన్స్ వచ్చింది. ఇక సీక్వెల్ సినిమాకి కూడా మలయాళంలో సినిమాకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగులో కూడా డైరెక్షన్ చేశారు ఇప్పుటికే ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలాకాలం అయింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయినా.. ‘హాట్‌స్టార్’ కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వెంకీ ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతన్న ‘ఎఫ్ 3’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zyg7do
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...