Friday, 16 July 2021

‘ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు.. దరిద్రం’ వయస్సు గురించి సిద్ధార్త్ సెన్సేషనల్ ట్వీట్స్

హీరోగా తెలుగు ప్రేక్షకులను ఒకప్పుడు అలరించిన నటుడు సిద్ధార్త్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. సరైన హిట్లు లేకపోవడంతో.. అతను ఇండస్ట్రీ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. అయితే సిద్ధార్త్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా అతను స్పందిస్తుంటాడు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను ఈ మధ్యకాలంలో ట్వీట్లు చేయడం ప్రారంభించాడు. కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీనే కారణమంటూ.. అతను ట్వీట్లు చేశాడు. దీంతో ఆ మధ్య అతనిపై విపరీతమై జరిగింది. అంతేకాక.. అతన్ని, అతని కుటుంబాన్ని చంపేస్తామంటూ.. అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని.. అతను పోలీసులను కూడా ఆశ్రయించాడు. దీంతో కొన్ని రోజుల పాటు పోలీసులు అతనికి భద్రత ఏర్పాటు చేశారు. అయితే సిద్ధార్త్ సోషల్‌మీడియాలో తన దూకుడు మాత్రం తగ్గించలేదు. తనకు నచ్చిని అంశాలపై ముక్కుసూటిగా చెబుతూ అతను తరచూ ఏదో ఒక సంచలనం సృష్టించాడు. తాజాగా అతను మరో వివాదాస్పద ట్వీట్ చేశాడు. వెంకటేష్ హీరోగా త్వరలో ‘నారప్ప’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఓ.. ’ అనే పాటను విడుదల చేశారు. ఇందులో వెంకటేష్‌కు జోడీగా అమ్ము అభిరామి నటించింది. దీంతో వయస్సుని ప్రధానాంశంగా తీసుకొని నారప్పపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. కొందరు మాత్రం అది కేవలం సినిమా కోసమేనని.. నిజానికి ఈ విషయంపై ట్రోల్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ఇందులోకి సిద్ధార్త్‌ని లాగాడు ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసిన అతను సిద్ధార్త్‌ని ట్యాగ్ చేశాడు. దీనిపై సిద్ధార్త్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ సిద్ధార్త్ ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్లు ఈ విషయాన్ని అంత సామాన్యంగ వదల్లేదు.. ‘నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా’ అంటూ మరో వ్యక్తి మళ్లీ సిద్ధార్త్‌ని గెలికాడు.. దీనిపై కూడా సిద్ధార్త్ రియాక్డ్ అయ్యాడు. ‘ఛా! అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్‌మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధార్త్ పేర్కొన్నాడు. దీనికి ‘సోది, అరాచకం, పరిస్థితుల ప్రభావం, దారుణం, నా వయస్సు నాకు తెలుసు’ అనే హ్యాష్‌ట్యాగులను ఆయన జత చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VQ4eRv
v

No comments:

Post a Comment