Friday, 16 July 2021

‘భీమ్ కోసం మరోసారి రామరాజు’.. అయితే ఈసారి వెండితెరపై కాదు..

‘’.. ఇప్పుడు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. బాహుబలి వంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు , ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించడం.. అది కూడా స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతరామ రాజు, కొమురం భీమ్ పాత్రలు పోషించడం మరింత ఆసక్తిని పెంచేసింది. చరిత్రలో ఎన్నడూ కలవని ఈ ఇద్దరు వీరులు కలిసి బ్రిటీష్ సామ్రాజ్యంపై పోరాటం చేస్తే ఎలా ఉంటుందా అనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ‘భీమ్ ఫర్ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒకరి మరొకరు గంభీర స్వరంతో చెప్పడం.. అందులోని దృశ్యాలు.. తదితర అంశాల కారణంగా ఇవి రెండు విడుదలై ఇన్ని రోజులు అయినా.. ఇప్పటి వాటిని అభిమానులు చూస్తున్నారు. టీజర్లే ఇలా ఉంటే వెండితెరపై వీళ్లద్దరు కలిసి పోరాటం చేస్తే ఇంకే రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు ఊహించుకుంటున్నారు. అయితే మరోసారి భీమ్ కోసం రామరాజు స్వయంగా కదలి వస్తున్నాడట. అయితే ఈసారి వెండితెరపై కాదు బుల్లితెరపై. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో ‘’ అనే రియాల్టీ షో త్వరలోనే ప్రసారం కానుంది. ఎప్పుడో ప్రకటించిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ షో షూటింగ్ వాయిదాపడింది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుకావడంతో షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించారు. జూనియర్ ఎన్టీఆర్‌ కూడా ఇప్పటికే ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే ఈ షో గురించి ఓ ఆసక్తికర బజ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్ రానున్నాడట. ఈ ఇద్దరు హీరోలకు ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉండటంతో తొలి సినిమాతోనే దాన్ని కరెక్ట్‌గా వాడుకోవాలని షో నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, ఇదే నిజమైతే.. తొలి ఎపిసోడ్‌తోనే షో టీఆర్‌పీ ఆకాశాన్ని తాకడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3z3PFrM
v

No comments:

Post a Comment