పదునైన ఛలోక్తులు, సందర్భానుసార సామెతలు, హాస్యాస్పద సంగతులతో అందరినీ కట్టి పడేస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే .. అప్పుడప్పుడు సినిమాల జోలి కూడా తీస్తుంటారు. ట్రెండ్ ఫాలో అవుతూ అందరికీ అర్థమయ్యేలా ఓ విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడం గరికపాటి లక్షణం. ప్రవచనాలు చెబుతూనే గతంలో చాలా సందర్భాల్లో సినిమాల టాపిక్ తీసిన ఆయన, తాజాగా స్టార్ హీరో గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెద్ద వయసు వాళ్ళే కాకుండా నేటి యువతరం అర్థం చేసుకునేలా గరికపాటి తన ప్రవచనాలపై వివరణ ఇస్తుంటారు. అందుకు సరైన ఉదాహరణలు తీసుకొని వివరిస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే పెద్దవాళ్ళతో యువతరం ఎందుకు కలవలేకపోతోంది? వారి మధ్యనున్న ఆలోచనల్లో తేడా ఏంటి? అనే విషయమై మాట్లాడిన గరికపాటి నరసింహారావు.. మధ్యలో స్టార్ హీరో విక్రమ్ టాపిక్ తీస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. మనం పిల్లలతో సరదాగా ఆడుకోవాలి అంటే మనం కూడా చిన్నపిల్లలం కావాలి. 90 ఏళ్ళ వయసున్న వారితో మాట్లాడాలంటే మన వయసు కూడా ఇంచుమించు అంతే ఉండాలి. లేదా అలాగే ఆలోచించాలి.. అప్పుడే వాళ్ళతో ఆనందంగా మాట్లాడగలం. ఈ తరం వాళ్ళు.. పెద్దవాళ్ళతో కలవలేకపోవడానికి కారణం ఏజ్‌లో ఉన్న తేడా మాత్రమే అని చెప్పిన గరికపాటి.. ఒకవేళ పెద్దవాళ్ళతో మాట్లాడే సందర్భమే వస్తే ఆ వయసులోకి వెళ్లి ఆలోచించి మాట్లాడాలని చెప్పారు. ఈ మేరకు విక్రమ్ ఇష్యూ తీస్తూ ఆయనను కమల్ హాసన్‌తో పోల్చారు గరికపాటి. బోలెడన్ని అవతారలతో విక్రమ్ అలరిస్తారని, ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోతారని, అందుకే అంతలా ఆ పాత్ర ఆకట్టుకుంటుందని అన్నారు. ముసలివాడి పాత్ర పోషించేటపుడు తాను ముసలివాడినే అనే భావన, రౌడీ వేషం వేస్తే రౌడీనే అనుకునే భావనతో నటిస్తేనే అది పండుతుంది. అలాగే ఏజ్ గ్రూప్‌లో పెద్దవారితో మాట్లాడే సమయంలో మనం కూడా ఆ ఏజ్ లోకి వెళ్లామనుకొని మాట్లాడాలని చెప్పుకొచ్చారు. కాగా, విక్రమ్ నటనకు పొగుడుతూ గరికపాటి చెప్పిన మాటలు విని విక్రమ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f6Eoze
v
No comments:
Post a Comment