టాలీవుడ్ బడా ప్రొడ్యుసర్స్‌లో ఒకరు. ఆయన వర్క్ విషయంలో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటారో.. మనీ విషయంలో కూడా పక్కా లెక్కలతో ఉంటారనే టాక్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే.. హీరోలకు టెక్నీషియన్లకు సరిగా డబ్బులు ఇవ్వరని.. పక్కా బిజినెస్‌మేన్‌లా బేరాలు ఆడి మరీ వర్క్ చేయించుకుంటారనే పేరు కూడా ఉంది. అయితే ఈ రూమర్లపై స్పందించిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చాలామంది తనకు డబ్బులు ఎగొట్టారంటూ అసలు విషయాన్ని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఇండస్ట్రీలో నాకు ఎగ్గొట్టినంత డబ్బు ఎవరికీ ఎగ్గొట్టి ఉండరు.. వాళ్లలో చాలామంది ధనికులు ఉన్నారు.. నార్మల్ పీపుల్స్ కూడా ఉన్నారు. వీళ్లంతా నాకు డబ్బు ఎగ్గొట్టినవాళ్లే. నాకు కోపం వస్తే.. ఏదో రోజు నాకు ఎవరెవరు డబ్బులు ఎగ్గొట్టారో.. నాకు ఇంకా ఎవరెవరు డబ్బులు ఇవ్వాలో వాళ్లందరి లిస్ట్ బయటపెడతా. మొత్తం డాక్యుమెంటేషన్‌తో సహా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేనేదో డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నట్టుగా చెప్తుంటారు. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్స్.. ఇలా చాలామంది నాకు డబ్బులు ఇవ్వాలి.. వీళ్లే కాకుండా స్టుడియో తీసుకున్నవాళ్లు.. నా దగ్గర అప్పులు తీసుకున్న వాళ్లు.. ఫైనాన్స్‌కి తీసుకున్న వాళ్లు ఇలా చాలామంది లిస్ట్ ఉంది. వాళ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు మ్యాటర్ కాదు.. కానీ కొంతమంది దగ్గర డబ్బు ఉండి కూడా తిరిగి ఇవ్వడం లేదు.. అక్కడే నాకు కోపం వస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు .
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ibpGcs
v
No comments:
Post a Comment