Monday, 12 July 2021

అందరు చేతులతో చేస్తే.. ఈమె కాళ్లతో.. అదా శర్మ వెరైటీ వీడియో

‘హార్ట్ ఎటాక్’అంటూ వెండితెరపై మెరిసింది . ఆ తర్వాత ‘క్షణం’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బన్నీతో కూడా కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’మూవీలో కనిపించింది. అయితే గత కొంతకాలంగా ఆదా శర్మకు తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. దీంతో అటు బాలీవుడ్ లో మాత్రం వరసగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయింది ఈ భామ. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.రోజూ ఏదో ఓ పోస్టు పెడుతూ ఉంటుంది. హాట్‌గా దుస్తులు ధరించి.. మంచి స్టిల్స్‌లో పిక్స్ దిగి వాటిని సోషల్‌మీడియా ద్వారా పంపుకుంటుంది. అయితే అదాలో ఇతర హీరోయిన్లలో లేని ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా హీరోయిన్లు అంటే కాస్త, సిగ్గు, బిడియం పడుతుంటారు. కానీ, అదా మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. తనకు నచ్చిన దుస్తులు ధరించడం, ఇష్టమొచ్చినట్లుగా ఫోటోలు దిగడం.. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోవడం చేస్తుంటుంది అదా. ఆమె పిక్స్ చూసి.. ‘పుర్రెకో బుద్ధి’ అని చాలా మంది అంటుంటారు. తాజాగా అదా మరో ఆసక్తికర వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఎవరైనా సరే పియానోని చేతులతో వాయిస్తారు.. కాళ్లతో వాయించే వాళ్లు చాలా అరుదు. కానీ, కాళ్లతో పియానో వాయించే వాళ్ల లిస్టులోకి అదా చేరింది. అయితే ఇందులో వెరైటీ ఏంటంటే.. అదా కాళ్లకి.. చేతి వేళ్లు మొలిచాయి. అలా పియానో వాయిస్తూ.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ‘మ్యాజిక్‌ని నమ్మాలి’ అంటూ ఆమె ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36xkysh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...