Monday, 12 July 2021

వర్షపు చినుకుల్లో రెచ్చిపోయిన ఇంద్రజ.. అది చూసి అందరిముందే ఆ మాట అనేసిన సుడిగాలి సుధీర్

బుల్లితెరపై ప్రసారమవుతున్న షోల్లో ‘’ అన్ని రకాలుగా ప్రేక్షకులకు వినోదం పంచుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సుడిగాలి సుధీర్‌ హోస్ట్ చేస్తున్న ఈ షోలో బుల్లితెర, వెండితెర తారల సందడి ఓ రేంజ్‌లో ఉంటోంది. దీంతో ప్రతి ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే 25వ ఎపిసోడ్‌ సెలబ్రేషన్స్ సందడి సందడిగా చేసేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్లు , స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. జులై 18వ తేదీన ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించి తాజాగా ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఇంద్రజ తన డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌తో ఇరగదీసింది. అందరిముందే వర్షపు చినుకుల్లో రెచ్చిపోయి చిందేసింది. మధ్యలో ఆమెకు లైలా కూడా తోడై డాన్స్ చేయడంతో అక్కడున్న వారంతా ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇంద్రజ డాన్స్‌తో ఒక్కసారిగా అక్కడి వాతావరణం హుషారెత్తింది. ‘మెరిసింది మేఘా మేఘా’ అంటూ ఆమె వేసిన స్టెప్పులు చూసి అందరూ వావ్‌! అన్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత స్టేజ్‌పై మళ్లీ డ్యాన్స్ చేశానని ఇంద్రజ చెప్పింది. ఇక ఇంద్రజ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌ చూసిన తనదైన శైలిలో కామెంట్ చేశాడు. 'సాంగ్ పర్‌ఫామ్ చేసి పద్దెనిమిదేళ్లు అయిందట.. కానీ పద్దెనిమిదేళ్ల పిల్లలా చేశారు' అని సుధీర్ అన్నాడు. ఇక ఇదే వీడియోలో లైలాతో హైపర్ ఆది చేసిన రచ్చ చూడొచ్చు. ఈ సన్నివేశాలతో విడుదలైన ఈ ప్రోమో వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియో చూసెయ్యండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2T2Zxmc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...