Friday, 9 July 2021

ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.. బిడ్డను మొదటిసారిగా ప్రపంచానికి చూపించిన హరితేజ

నటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బుల్లితెరపై విలనిజాన్ని ప్రదర్శించి.. వెండితెరపై నవ్వులఝల్లు కురిపించారు. అలా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో హరితేజ చేసే అల్లరికి మామూలు ఫాలోయింగ్ ఉండదు. ఆమె గాత్రానికి ఎంతో మంది ఫిదా అవుతుంటారు. ఆమె నృత్య కళలకు ఇంకెంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా హరితేజ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్లు ఇస్తూనే ఉంటారు. ఇక హరితేజను గత కొన్ని రోజులు ఆమె అభిమానులు ఓ విషయాన్ని పదే పదే అడుగుతూ వచ్చారు. హరితేజకు పండంటి బిడ్డ పుట్టాక.. ఒక్కసారి కూడా చూపించలేదు. బిడ్డ పుట్టిందని చెప్పారు.. డెలీవరీ సమయంలో ఎదురైన అనుభవాలు, కష్టాలను చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. కరోనా సమయంలో, పాజిటివ్ వచ్చినా కూడా డెలివరీ సక్రమంగా అయిందని అన్నారు. అలా ప్రతీ విషయాన్ని చెప్పిన హరితేజ.. తన పాప మొహాన్ని మాత్రం చూపించకుండా ఊరిస్తూ వచ్చారు. చివరకు పాపకు పేరు పెట్టిన సందర్భంలోనూ మొహాన్ని చూపించలేదు. అంటూ పేరు పెట్టినట్టు ప్రకటించారు. ప్రకృతికి సంబంధించిన పేర్లు పెట్టాలనే ఉద్దేశ్యంలోనే ఇలా భూమి అని ఫిక్స్ అయ్యామని హరితేజ తెలిపారు. పాపను ఎప్పుడు చూపిస్తారు? అని అభిమానులు పదే పదే అడుగుతూ వచ్చారు. త్వరలోనే కచ్చితంగా చూపిస్తాను అని హరితేజ మాటిచ్చారు. అలా ఇచ్చిన మాట ప్రకారం తాజాగా హరితేజ తన పాపను చూపించారు. భూమి దీపక్ రావ్‌ని చూడండి.. అంటూ తన బుజ్జిపాపను చూపించేశారు. ఇక ఈ ఫోటోలను చూసిన సెలెబ్రిటీలు కామెంట్ల వర్షాన్ని కురిపించారు. శిల్పా చక్రవర్తి, వింధ్యా విశాఖ, అశ్మిత, చైత్రా రాయ్, గీతా మాధురి వంటి వారంతా రియాక్ట్ అయ్యారు. అందరూ చిన్నితల్లిని ఆశీర్వదించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AJOn70
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...