Wednesday, 7 July 2021

సీఎం కేసీఆర్ మనవడి సినీ ఎంట్రీ ఫిక్స్? టాప్ డైరెక్టర్, నిర్మాత ప్రయత్నాలు! హాట్ హాట్ చర్చల్లో ఇష్యూ

ఒక్కోసారి కొన్ని విషయాలు వింటే మరీ విచిత్రంగా అనిపిస్తుంది. ఇదేంటి? ఇది సాధ్యమేనా.. అయినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనే సందేహాలు కలుగుతుంటాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అని పెద్దలు చెప్పినట్లు ఒక్కోసారి నమ్మశక్యం కాకపోయినా వినక తప్పదు. తాజాగా మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు విషయమై అలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజలకు కేటీఆర్ తనయుడిగా సుపరితమైన ఇవ్వబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆయన తీసుకున్న తాజా నిర్ణయమే. సీఎం కేసీఆర్‌కు వారసుడిగా హిమాన్షు రాజకీయాల్లోకి రావడం ఖాయమని గత కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. దీంతో వీటిపై స్వయంగా హిమాన్షు క్లారిటీ ఇచ్చేశారు. తాను భవిష్యత్‌లో ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. తనకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలు ఉన్నాయని, వాటిని చేరుకోవడమే తన ధ్యేయమని తెలిపుతూ ట్టిట్టర్‌లో పోస్టు పెట్టారు. దీంతో ఇక భవిష్యత్తులో హిమాన్షు రాజకీయ ఆరంగేట్రం ఉండదని కన్ఫర్మ్ అయింది. ఇంతలో తెరపైకి సరికొత్త వాదన రావడం హాట్ టాపిక్ అయింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే టాప్ డైరెక్టర్, నిర్మాత హిమాన్షును సినీ గడప తొక్కించబోతున్నారని అంటున్నారు. ఇందుకోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందుకే తనకు రాజకీయాలపై మక్కువ లేదని, భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లోకి రానని హిమాన్షు స్పష్టం చేశారని చెప్పుకుంటున్నారు. సో.. చూడాలి మరి దీనిపై కేసీఆర్ ఫ్యామిలీ నుంచి గానీ హిమాన్షు నుంచి గానీ ఎలాంటి స్పందన వస్తుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3AEADKz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...