Wednesday, 7 July 2021

బాడీ షేప్ కోసం రాశీ ఖన్నా కష్టాలు.. ఆ వీడియో చూడగానే పాయల్ రాజ్‌పుత్ రియాక్షన్

సోషల్ మీడియాలో హీరోయిన్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రాశీ ఖన్నా తెరపై అంతగా అందాలను ప్రదర్శించేవారు కాదు. కానీ ఈ మధ్య రూట్ మార్చేసినట్టు కనిపిస్తున్నారు. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత బికినీలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉన్న రాశీ ఖన్నా.. ఇప్పుడు నాజూగ్గా మారిపోయారు. ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్‌లోకి వచ్చేశారు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన నటనతో ఆమె ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలోనూ వరుస సినిమాలతో ఆమె బిజీ అయిపోయారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు రాశీ. తరచూ ఫోటోషూట్‌లు చేస్తూ ఆ పిక్స్‌తో కుర్రకారుని మంత్రముగ్దులను చేస్తున్నారామె. అయితే గతంలో చాలా బొద్దుగా ఉన్న రాశీ.. ఇప్పటికే చాలా స్లిమ్ అయ్యారు. కానీ, ఆమె ఇంకా మంచి షేప్ కోసం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం గంటల పాటు జిమ్‌లో ఆమె కసరత్తు చేస్తున్నారు. తాజాగా తన జిమ్‌కి సంబంధించిన వీడియోని రాశీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీనికి ‘లోడింగ్’ అంటూ ఆమె క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. నటి .. దీనికి లవ్ సింబల్‌ని కామెంట్‌గా పెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yt1IP2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...