Wednesday, 28 July 2021

మాల్దీవుల్లో వెకేషన్.. రొమాంటిక్ మూడ్‌లో నితిన్.. ఫోటోలతో షాలిని రచ్చ

నితిన్ వివాహాం జరిగి ఏడాది గడిచిన సంగత తెలిసిందే. గత ఏడాది జూలై 26న ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంతో ఘనంగా వివాహాన్ని చేసుకుందామని వేసుకున్న ప్రణాళికలను కరోనా దెబ్బ కొట్టేసింది. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ నితిన్ దుబాయ్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. కానీ కరోనా మూలంగా అన్నీ తారుమారయ్యాయి. అలా లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ.. కరోనా సమయంలోనే నితిన్ తన స్నేహితురాలు, ప్రియురాలైన షాలినీని వివాహాం చేసుకున్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహాం జరిగింది. వివాహాం జరిగి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ జంట మాల్దీవుల్లో మకాం వేసినట్టు తెలుస్తోంది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ ఇద్దరూ చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అయ్యాయి. నా జీవితాన్ని ఎంతో ఆనందంగా, సంతోషంగా మలిచావ్.. నా జీవితాంతం నీతోనే గడపాలని ఉంది అంటూ తన భార్యపై నితిన్ ప్రేమను కురిపించారు. ఇప్పడు ఎప్పుడూ ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని షాలినీ పేర్కొన్నారు. అలా ఈ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. అయితే ఈ ఇద్దరూ కూడా మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఏడాది అయిన సందర్భంగా ఇలా జాలీగా వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా షాలినీ షేర్ చేసిన ఫోటోలను చూస్తే నితిన్ మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ జంట మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. నితిన్ ప్రస్తుతం అంధాదున్ రీమేక్ అయిన మాస్ట్రోను పూర్తి చేసే పనిలో ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rILoYu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...