Wednesday, 28 July 2021

పవన్ ఓ పుస్తకం.. ఆయన వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాల్సిందే: రానా పొగడ్తల వర్షం

‘’ సోషల్ మీడియాలో మారుమోగుపోతున్న ఈ పేరు.. పవన్-రానా అప్ కమింగ్ మూవీకి సంబంధించినదే. అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు.. దగ్గుబాటి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ చిత్రంలో ‘భీమ్లా నాయక్’ అనే పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్-రానాలు మల్టీస్టారర్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుండటంతో ఈ సినిమాపై బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. కాగా సోమవారం నాడు ఈ మూవీ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌తో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంటూ పొగడ్తలతో ముంచెత్తారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తానని అసలు అనుకోలేదని.. ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందన్నారు రానా. ఆయన నటించడాన్ని బట్టి చూస్తేనే ఆయనకు నటనలో ఎంత అనుభవం ఉందో తెలిసిపోతుందని.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని అన్నారు రానా. ముందుగా పవన్ కళ్యాణ్ గారిని చూడగానే ఆయన వ్యక్తిత్వానికి, అనుభవానికి గౌరవం ఇవ్వాలనిపిస్తుందని.. షూటింగ్ గ్యాప్‌లో చాలా సరదాగా ఉంటారని ఆయనకు చాలా విషయాలపై పూర్తి అవగాహన ఉంటుందన్నారు. పవన్ మాట్లాడే ప్రతి మాట ద్వారా ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తుందని.. ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ ఓ మంచి పుస్తకం అని కొనియాడారు రానా దగ్గుబాటి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BSyQlK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...