Thursday, 29 July 2021

గాడ్ ఫాదర్ చిరంజీవి.. అభిమానులు ఫిదా అయ్యేలా అదిరిపోయే స్కెచ్చేసిన మెగా టీమ్!

రీ- ఎంట్రీ తర్వాత మెగాస్టార్ మరోసారి హవా నడిపిస్తున్నారు. వరుస సినిమాలకు కమిటవుతూ మెగా అభిమాన లోకాన్ని ఫిదా చేస్తున్నారు. విలక్షణ కథలతో అలరించాలని ఫిక్సయిన ఆయన.. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. మలయాళీ సూప్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమే 'లూసీఫర్'. దీన్ని చిరంజీవి తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఒరిజినల్ కథలో పలు మార్పులు చేర్పులు చేసిన చిత్రయూనిట్.. ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పేర్లు పరిశీలించి చివరకు '' అనే టైటిల్ ఫిక్సయ్యారట. మెగా అభిమానులు ఫిదా అయ్యేలా అదిరిపోయేలా సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 12 నుంచి మొదలు కానుందని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. విద్యాబాలన్ మెగాస్టార్‌కి సిస్టర్‌గా నటించబోతుందని, అలాగే హీరోయిన్‌గా నయనతారను ఫైనల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. మరో కీలకపాత్రలో యువ హీరో సత్యదేవ్ నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమాన లోకం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఆయన కెరీర్‌లో 152వ సినిమాగా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BTMa9x
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...