Wednesday, 28 July 2021

20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య.. ఇదో అరాచకంలా ఉందే!

సినిమాలు ఎన్నో వస్తాయి కానీ కొన్నింటిలోనే వైవిద్యం కనిపిస్తుంది. అది చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అనేది పక్కన బెడితే అలాంటి వైవిద్యభరితమైన కథలకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ ఫార్మాట్‌కి పూర్తి భిన్నంగా ఆలోచించి 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకొస్తున్నారు నూతన దర్శకుడు చైతన్య కొండ. అయినా 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య ఏంటి? అదెలా సాధ్యం.. ఇప్పటిదాకా ఆ మాట కూడా ఎక్కడా వినలేదే.. ఇదో అరాచకంలా ఉందే అనుకుంటున్నారు కదూ. ఎవరేమనుకున్నా అదే రిలేషన్‌ను వెండితెరపై చూపించబోతున్నారు ‘’ దర్శకనిర్మాతలు. అసలు అలా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది..? మరి వాళ్లిద్దరూ జీవితాంతం కలిసి ఉన్నారా..? అనే ఆసక్తికరమైన పాయింట్ తీసుకొని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాస్యనటి , ‘కేరింత’ ఫేమ్‌ లీడ్ రోల్స్ పోషించారు. ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. చిత్రంలో శివారెడ్డి, సుమన్ శెట్టి, గౌతంరాజు, అనంత్, జెన్ని, సుబ్బరాయశర్మ, కోట శంకరావు, పద్మజయంతి తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. సత్య కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘సావిత్రి w/o సత్యమూర్తి’ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, కుటుంబసమేతంగా అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక సినిమా అని చిత్రయూనిట్ అంటోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అతిత్వరలో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xb0zL5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...