Monday, 7 June 2021

The Family Man : శరీరంలోని ప్రతీ భాగం నొప్పి పుట్టింది.. అసలు విషయం చెప్పిన సమంత

పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2తో సమంత తన సత్తాను చాటుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇక బోల్డ్ సీన్స్‌లోనూ సమంత రెచ్చిపోయి నటించారు. అన్నింటికంటే ముఖ్యంగా చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో సమంత పడిన కష్టం అంతా ఇంతా కాదు. దీని కోసం సమంత ఒళ్లు హూనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఓ వీడియోను సమంత షేర్ చేశారు. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో సమంత పోషించిన రాజీ పాత్ర సామాన్యమైంది కాదు. తమిళదేశం కోసం ఈలం పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతో మందికి ప్రతిరూపంగా.. అన్యాయానికి గురైన మహిళకు చిహ్నంగా సమంత రాజీ పాత్రలో జీవించారు. రాజీ పాత్రలో ఉన్న ఎమోషన్స్‌ను సమంత సీజన్ మొత్తం కంటిన్యూ చేశారు. ఎక్కడా కూడా పాత్ర పరిధి దాటి సమంత నటించలేదు. మరీ ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే దుమ్ములేపేశారు. ఫ్యామిలీ మెన్ సీజన్ 2లోని యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా రావడానికి, తాను అంత బాగా చేయడానికి కారణం ఒక్కరేనట. యానిక్ బెన్ అనే యాక్షన్ కొరియోగ్రఫర్ గురించి సమంత తాజాగా చెప్పుకొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ అంత బాగా చేసేందుకు నాకు ఎంతో సహాయపడిన, శిక్షణ ఇచ్చిన యానిక్ బెన్‌కు స్పెషల్ థ్యాంక్స్. నా శరీరంలోని ప్రతీ భాగం నొప్పి పుట్టినా కూడా నా వెన్నంటే ఉండి చూసుకున్నావ్.. నా పెయిన్ కిల్లర్‌వి అయ్యావ్.. నాకు మామూలుగా హైట్స్ అంటే భయం. కానీ ఆ జంప్‌లు చేశానంటే.. నువ్ నా వెనుకున్నావ్ అనే ధైర్యంతోనే. థ్యాంక్యూ అంటూ యాక్షన్ డైరెక్టర్ మీద ప్రశంసలు కురిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uVhMH7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...