Friday, 25 June 2021

Thalapathy Vijay : దళపతి విజయ్‌పై బాలీవుడ్ బాద్ షా కామెంట్.. షారుఖ్ పోస్ట్ వైరల్

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాల పరంగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కాస్త వెనకబడ్డారు. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో గత మూడు నాలుగేళ్లుగా షారుఖ్ సైలెంట్ అయిపోయారు. అలా షారుఖ్ నుంచి ఓ బ్లాక్ బస్టర్ రావాలని అభిమానులు ఎంతగానో కోరుతున్నారు. షారుఖ్ కూడా ఆచితూచి ఓ సూపర్ డూపర్ స్క్రిప్ట్‌ను ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలా షారుఖ్ తదుపరి చిత్రాల మీద ఎన్నో రూమర్లు వచ్చాయి. బాలీవుడ్ బాద్ షా సినీ జీవితానికి నేటితో 29 ఏళ్లు నిండాయి. అలా షారుఖ్ నేటి ఈ స్పెషల్ డే సందర్బంగా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. AskSRK అంటూ అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. అయితే కేవలం పదిహేను నిమిషాలే సమయం ఉందని షారుఖ్ చెప్పుకొచ్చారు. అలా నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు షారుఖ్ సమాధానాలు చెప్పారు. ఇందులో తన కొత్త సినిమాలు, సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు, థియేటర్లు పున: ప్రారంభం వంటి విషయాలెన్నో అడిగారు. తన సినిమాలకు సంబంధించిన ప్రకటనలు త్వరలోనే రాబోతోన్నాయని షారుఖ్ తెలిపారు. అయితే ఇందులో ఓ నెటిజన్ గురించి అడిగేశాడు. విజయ్ గురించి వన్ వర్డ్ చెప్పండి అని షారుఖ్‌ను అడగడంతో అదిరిపోయే రిప్లై ఇచ్చారు. వెరీ కూల్ అంటూ సింగిల్ వర్డ్‌లో విజయ్‌పై ప్రేమను కురిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jeD4xq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...