Friday, 25 June 2021

Sharwa30 : కొత్త సినిమా అప్డేట్‌తో శర్వానంద్ రచ్చ

టాలీవుడ్ విలక్షణ నటుల్లో పేరు ఎప్పుడూ ఉంటుంది. హీరోయిజం వెంట కాకుండా కథ, కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఉంటారు. ప్రయోగాత్మక చిత్రాలకే ఓటు వేస్తుంటారు. ఆ ప్రయత్నంలో అపజయాలు ఎదురైనా కూడా వెనకడుగు వేయరు. అలా శర్వానంద్ ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. శర్వానంద్‌కు ప్రస్తుతం వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. రణరంగం, శ్రీకారం వంటి చిత్రాలైనా హిట్ అవుతాయని భావిస్తే అవి కూడా బోల్తా కొట్టాయి. అలా శర్వానంద్ గ్రాఫ్ ఇప్పుడు కాస్త డౌన్‌లో ఉంది. అయితే ఇప్పుడు మాత్రం శర్వా తన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహా సముద్రం అంటూ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ దుమ్ములేపేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆ చిత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలు లైన్‌లో ఉంచేశారు. అందులో ఓ ద్విభాష చిత్రం కూడా ఉంది. బ్యానర్ మీద ఎస్ ఆర్ ప్రభు నిర్మాతగా వస్తోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతోంది. శర్వానంద్ 30వ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. జూన్ 28వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతూ వర్మ నటిస్తున్నారు. ఆడాళ్లూ మీకు జోహార్లు అనే సినిమాతోనూ శర్వానంద్ బిజీ కానున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jcEyYK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...