Friday, 18 June 2021

Thalapathy Vijay : Thalapathy 65 First Look.. దళపతి ఫ్యాన్స్‌కు ఇక పండుగే

సోషల్ మీడియాలో దళపతి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. విజయ్ సినిమాల అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అసలే ఇక తెలుగులోనూ విజయ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతోన్న సినిమాతో విజయ్ టాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. అయితే అంతకు ముందే విజయ్ మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేశారు. ఈ మేరకు ఆ మధ్య చేసిన పూజా కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. విజయ్ బర్త్ డే జూన్ 21. అయితే బర్త్ డే ఫీవర్ మాత్రం ఇప్పటికే మొదలైంది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే.. దళపతి 65వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ రానుందని అంతా భావించారు. ఈ మేరకు ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. విజయ్ ఫస్ట్ లుక్ ,టైటిల్ రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది. నెల్సన్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ విజయ్ బర్త్ డే నాడు అభిమానులకు విందు చేయబోతోన్నాయి. జూన్ 21న సాయంత్రం ఆరు గంటలకు ఫస్ట్ లుక్ రాబోతోందంటూ ప్రకటించేశారు. ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. అలా మొత్తానికి పూజా హెగ్డే కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలను సమకూర్చబోతోన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vDwbs3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...