Friday, 18 June 2021

కాళ్లు, చేతులతో ఒకేసారి.. అభిమాని పనికి షాక్.. దేవుడా అంటూ రష్మిక మందన్న పోస్ట్

రష్మిక మందన్నకు ఇప్పుడున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేయకపోయినా కూడా నేషనల్ క్రష్ అంటూ ట్యాగ్ తెచ్చేసుకున్నారు. అలా రష్మికకు సోషల్ మీడియాలో విపరీతమ ఫాలోయింగ్ వచ్చేసింది. రష్మికకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో అప్డేట్లు ఇవ్వకపోతే ఏమైందా? అంటూ రష్మిక గురించి ఆరా తీస్తుంటారు. అలా రష్మిక తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటారు. ఇక పేరు మీదుగా కూడా సేవా కార్యక్రమాలు అభిమానులు చేస్తుంటారు. ఇక కొందరు అభిమానులు తమ ప్రేమను రకరకాలుగా చూపిస్తుంటారు. అయితే తాజాగా రష్మిక ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఓ అభిమాని తన ప్రేమను చూపించిన తీరుకు రష్మిక షాక్ అయ్యారు. దేవుడా అంటూ రష్మిక ఆశ్చర్యపోయారు. కాళ్లుచేతులు అన్నీ ఓకేసారి వాడుతూ నాలుగు బొమ్మలను గీసేశాడు. కాళ్లతో,చేతులతో ఒకేసారి నాలుగు బొమ్మలను గీయడంతో అంతా ఆశ్చర్యపోతోన్నారు. ఇక ఆ అభిమానిపై రష్మిక తన ప్రేమను కురిపించారు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.. నిర్ఘాంతపోయాను.. ఇదే అభిమానానికి పరాకాష్ట.. థ్యాంక్యూ అంటూ రష్మిక ఉప్పొంగిపోయారు. ఇక రష్మిక అభిమాని గీసిన ఆ బొమ్మలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు, టాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్ కూడా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zBEQ1e
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...