Saturday, 12 June 2021

Supritha: పర్సనల్ సీక్రెట్స్.. కన్నుకొడుతూ యమ హాట్‌గా ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి డాటర్ నాయుడు.. ఇప్పటిదాకా సినిమాలేవీ చేయకపోయినా నేమ్ ఫేమ్ మాత్రం కొట్టేసింది. ఆన్ లైన్‌లో చురుకుగా ఉండే ప్రతి ఒక్కరికీ సుప్రిత నాయుడు సుపరిచితమే. తన సోషల్ ఖాతా ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ సెలబ్రిటీ కిడ్.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తోంది. దీంతో అమాంతం తన ఫాలోయింగ్ పెంచుకున్న సుప్రిత, తాజాగా ఆన్ లైన్ క్వశన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించి పలు ప్రశ్నలపై ఓపెన్ అయింది. ఈ సెషన్‌లో తన ఆహార అలవాట్లు, ఇష్టమైన ప్రదేశాలు, వ్యక్తిగత విషయాలపై సుప్రిత నాయుడు రియాక్ట్ అయింది. తనకు బీచ్ లలో షికారు చేయడమంటే ఇష్టమని చెప్పిన ఆమె, తనకు కాల్స్ మాట్లాడటం కంటే టెక్స్ట్ మెసేజెస్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పింది. ఇక షార్ట్ హెయిర్ ఇష్టమా లేక లాంగ్ హెయిర్ ఇష్టమా? అనే ప్రశ్నపై రొమాంటిక్‌గా బదులిస్తూ పొడవాటి హెయిర్ అంటేనే ఇష్టమని కన్నుకొడుతూ చెప్పింది. ఇంకా లవ్ సాంగ్స్ వినడం, కుర్తా కంటే సారీ కట్టుకోవడమే ఇష్టమని ఆమె చెప్పింది. వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించి సురేఖా వాణి ఎంత ఫేమస్ అయిందో.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి అంతే ఫేమస్ అయింది ఆమె కూతురు సుప్రిత. తల్లితో కలిసి డాన్సులేస్తూ యువత చూపును అట్రాక్ట్ చేయడమే గాక.. వాళ్ళతో లైవ్ చాట్స్ చేస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంటోంది. కూతురు సుప్రితతో కలిసి సురేఖ చేసే అల్లరి నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. మరోవైపు సురేఖా వాణి రెండో పెళ్లి గురించి, అలాగే సుప్రిత సినీ ఎంట్రీ గురించి జనాల్లో చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే సురేఖా వాణి రెండో పెళ్లి మ్యాటర్ బాగా వైరల్ కావడంతో దీనిపై సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత విషయాలపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సుప్రిత సినీ ఎంట్రీ మ్యాటర్ మాత్రం ఇప్పటిదాకా సస్పెన్స్ గానే నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SlqrFP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...