Saturday, 12 June 2021

పో అమ్మా ఇక చాలంటూ పోస్ట్.. షూటింగ్‌ మొదలెట్టేసిన కౌశల్

ప్రస్తుతం కరోనా పరిస్థితి కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూల్లో మినహాయింపులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా సినీ ఇండస్ట్రీలో సందడి వాతావరణం కనిపిస్తోంది. కొందరు షూటింగ్‌లు కూడా మొదలెట్టేశారు. అలా బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కూడా షూటింగ్‌ మొదలుపెట్టేశారట. ఈ మేరకు కౌశల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంతే కాకుండా కరోనా మీద వేసిన సెటైర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ విజేత కౌశల్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ వచ్చేసింది. రెండో సీజన్ జరిగినంత కాలం కౌశల్ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. అలా కౌశల్‌కు వచ్చిన ఫేమ్‌తో విపరీతమైన సినీ అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ కౌశల్‌కు మాత్రం ఆశించినంత ఆఫర్లు రాలేదు. కానీ ఈ మధ్య కౌశల్‌కు మంచి అవకాశాలే వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆది సాయి కుమార్ సినిమాలో ఓ పవర్ ఫుల్ రోల్‌లో కౌశల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆది హీరోగా వస్తున్న బ్లాక్ సినిమాలో కౌశల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. ఆ మధ్య తన లుక్‌కు సంబంధించిన పోస్టర్లు బాగానే వైరల్ అయ్యాయి. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ షూటింగ్‌లు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి. ఈక్రమంలో రెండు నెలల గ్యాప్ తరువాత మొదటి సారిగా షూటింగ్‌లో పాల్గొన్నాను అని కౌశల్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కరోనా మీద కౌశల్ కౌంటర్లు వేశారు. పో అమ్మా ఇక చాలు అంటూ కరోనాను బుజ్జగించారు. ప్రస్తుతం కౌశల్ షేర్ చేసిన పిక్, చేసిన కామెంట్ రెండూ వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vkN8ai
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...