Thursday, 24 June 2021

Sohel : అనిల్ రావిపూడితో సోహెల్ చర్చలు.. కథ వేరేలా ఉందే!!

బిగ్ బాస్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో చేసే సందడే వేరే లెవెల్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా గత ఏడాది జరిగిన నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు ఎక్కడా లేని క్రేజ్ దక్కింది. నాల్గో సీజన్‌లో పాల్గొన్న దాదాపు ప్రతీ కంటెస్టెంట్‌కు గుర్తింపు వచ్చింది. అలా ఇప్పుడు సోషల్ మీడియాలో స్టార్ సెలెబ్రిటీగా దూసుకుపోతున్నారు. తాజాగా సోహెల్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో భేటీ అయ్యారు. అయితే ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదని సోహెల్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ నాడు ఎంట్రీ ఇచ్చి ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. కరోనా, లాక్డౌన్ నిబంధనల వల్ల బిగ్ బాస్ ఇంట్లోకి ఎవ్వరూ కూడా వెళ్లలేదు. కానీ ఫినాలే ఎపిసోడ్ నాడు అనిల్ రావిపూడి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. టాప్ 5 ఫైనలిస్ట్‌లతో ముచ్చటించారు. అలా సోహెల్‌తో అనిల్ రావిపూడి కామెడీ చేశారు. కథ వేరే ఉంటది అంటూ సోహెల్‌ను అనిల్ రావిపూడి ఇమిటేట్ చేశారు. డీల్ ఏమీ కుదర్చుకోను.. మీ సినిమాలో ఛాన్స్ ఇస్తే చాలు అని అనిల్ రావిపూడితో సోహెల్ కామెడీ కూడా చేశారు. ఇక తాజాగా అనిల్ రావిపూడిని కలిసిన సోహెల్ నాటి విషయాలన్నీ గుర్తుకు చేసుకున్నారట. ఈ మేరకు సోహెల్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. జీరో యాటిట్యూడ్, ఎంతో మంచి మనిషి, ఎంతో ఇంటెలిజెంట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని కలిసే చాన్స్ వచ్చింది . అయితే ఇది ఫ్రెండ్లీగా, సాధారణంగా కలిశాను. బిగ్ బాస్ రోజులను గుర్తుకు చేసుకున్నాం. మా ప్రయాణాలు, అనుభవాల గురించి మాట్లాడుకున్నాం. ఆయన సక్సెస్ జర్నీ నుంచి ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. అవి ఎప్పటికీ నేను గుర్తుంచుకుంటాను.. ఫాలో అవుతాను.. మీ సమయాన్ని నాకోసం కేటాయించినందుకు థ్యాంక్స్. మళ్లీ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను సర్ అంటూ సోహెల్ పోస్ట్ చేశారు. సోహెల్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U1oWNq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...