Tuesday, 22 June 2021

Sekhar Kammula: ధనుష్‌‌తో సాయి పల్లవి రొమాన్స్.. అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్న డైరెక్టర్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని ఇటీవలే ప్రకటించారు సెన్సిబుల్‌ డైరెక్టర్‌ . తెలుగులో ధనుష్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇదే కావడంతో ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట డైరెక్టర్. ఈ మేరకు నటీనటుల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన, ఫిదా బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో లాగే అదే మ్యాజిక్ రిపీట్ చేసి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేయాలని చూస్తున్నారట. శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబినేషన్ అనగానే అందరిలోనూ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌లో కూడా యాడ్ అయితే మరింత క్రేజ్ రావడం పక్కా. అదే ఆలోచనతో శేఖర్ కమ్ముల ఈ డిసీజన్ తీసుకున్నారని టాక్. గతంలో శేఖర్ కమ్ములతో 'ఫిదా' చేసిన సాయి పల్లవి రీసెంట్‌గా 'లవ్ స్టోరీ' కంప్లీట్ చేసింది. అలాగే ధనుష్‌తో 'మారి 2'లో జతకట్టింది. ఈ సినిమాలోని 'రౌడీ బేబీ' సాంగ్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల నడుమ ధనుష్- సాయి పల్లవి మళ్ళీ జతకట్టబోతున్నారనే వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ధనుష్‌ భారీ రెమ్యునరేషన్‌ తీసుకోతున్నాడని తెలుస్తోంది. సో.. చూడాలి మరి సాయి పల్లవికి ఏ రేంజ్ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసి శేఖర్ కమ్ముల ప్లాన్ అమలులోకి తీసుకొస్తాడనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xLheph
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...