Tuesday, 22 June 2021

తప్పును ఎండగట్టిన హీరోయిన్.. మెహరీన్ దెబ్బకు దిగొచ్చిన ట్రావెల్ ఏజెన్సీ

ఒక్కోసారి సోషల్ మీడియా వేదికపై చిటికలో సమస్యలు పరిష్కారమవుతుంటాయి. సోషల్ మీడియా ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని కొన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వినియోగదారుల పట్ల ఆయా సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాటిని సోషల్ మీడియా నిలువరిస్తుంటుంది. సంస్థల పరపతిని సోషల్ మీడియా దిగజార్చగలదు. అలా కొంత మంది సెలెబ్రిటీలు ఆ మధ్య విమానయాన సంస్థల మీద గుస్సా అయ్యారు. సేవలు సరిగ్గా లేవని, కించపరుస్తున్నారంటూ సెలెబ్రిటీలు చేసిన ట్వీట్లు, ఫిర్యాదులపై ఆయా సంస్థలు వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాయి. తాజాగా విషయంలోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది. ఇక్సిగో అనే ట్రావెల్ ఏజెన్సీ ప్రవర్తన పట్ల మెహ్రీన్ అసహనం వ్యక్తం చేశారు. ఇక్సిగోది కచ్చితంగా బాధ్యతరాహిత్యమే. నా టికెట్ రిఫండ్ డబ్బులు మూడు నెలలు అయినా కూడా వెనక్కి రాలేదు. ఇది ఇక రాదని కూడా అనిపిస్తోంది. ఇది కచ్చితంగా మోసం. ఇక ఎప్పుడూ కూడా అది నా వ్యక్తిగతమైనా సరే ప్రొఫెషనల్ పనికైనా సరే ఇది వాడనే వాడను. నా ఫ్యాన్స్ కూడా దీని ట్రాప్‌లో పడకండ అని మెహ్రీన్ ట్వీట్ వేశారు. అలా మెహ్రీన్ వేసిన ట్వీట్‌తో తమ సంస్థకు చేటు జరుగుతుందని భావించిన ఇక్సిగో వెంటనే స్పందించింది. హేయ్ మెహ్రీన్.. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మేం దీన్ని చెక్ చేస్తున్నాం.. ఈ రోజు గడిచే లోపు సమస్యను పరిష్కరిస్తామని బదులిచ్చింది. అయితే దీనికి మెహ్రీన్ కౌంటర్ వేశారు. అవునా.. ఈ మాటలు నేను చాలా రోజుల నుంచి వింటున్నాను.. నేను సెలెబ్రిటీని కాబట్టి మీరు నాకు రెస్పాండ్ ఇచ్చారు.. అయితే సాధారణ ప్రజల విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారో తలుచుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుందని మెహ్రీన్ సెటైర్ వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zHdkzz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...