Monday, 21 June 2021

Sai Dharam Tej : ‘రిపబ్లిక్’ డబ్బింగ్ షురూ.. రంగంలోకి దిగిన సాయి ధరమ్ తేజ్

సుప్రీమ్ హీరో ప్రస్తుతం సెట్స్ మీదకు వచ్చేశారు. ఆయన చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నా కూడా అన్నింటి కంటే ముందు సినిమాపైనే దృష్టిపెట్టేశారు. దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. డబ్బింగ్ పనులు కూడా సగం పూర్తయ్యాయి. కానీ ఆ మధ్య సెకండ్ వేవ్ ఉధృతంగా రావడంతో అన్ని పనులు మూలకు పడ్డాయి. ప్రస్తుతం పరిస్థితులన్నీ సద్దుమణుగుతుండటంతో షూటింగ్‌లు కూడా మొదలయ్యాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు సైతం సెట్స్ మీదకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ కూడా ఇంటి నుంచి అడుగులు బయటపెట్టేశారు. రిపబ్లిక్ షూటింగ్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేశారు. ఇలా తాజాగా రిపబ్లిక్ డబ్బింగ్ పనులు మొదలట్టేయగా.. సాయి ధరమ్ తేజ్ తన పనిని పూర్తి చేసే పనిలో పడ్డారు. డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని సాయి ధరమ్ చెప్పుకొచ్చారు. ఆ మధ్య వదిలిన టీజర్, పోస్టర్ అన్నీ కూడా రిపబ్లిక్ సినిమా మీద అంచనాలను పెంచేశాయి. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్యా రాజేశ్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొన్నటి వరకు ఈ మూవీ ఓటీటీలో రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే వీటిపై పరోక్షంగా దర్శకుడు స్పందించారు. థియేటర్లోనే ఈ మూవీ రాబోతోందంటూ పోస్ట్ పెట్టేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UsDshv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...