Monday, 21 June 2021

హిట్టిచ్చిన దర్శకుడిపై ప్రేమను కురిపించిన హీరోయిన్.. చాందినీ చౌదరి పోస్ట్ వైరల్

సినిమాతో ఎంతో మందికి మంచి పేరు వచ్చింది. హీరోగా మొదటి సారిగా సుహాస్ ప్రయత్నించడం, హీరోయిన్‌గా చాందినీ చౌదరికీ మంచి హిట్ పడటం, దర్శకుడిగా సందీప్ రాజ్‌కు మొదటి ప్రయత్నమే భారీ హిట్‌ను తెచ్చిపెట్టింది. అలా కలర్ ఫుల్ సినిమా ఎంతో మంది జీవితాల్లో కలర్స్ నింపింది. ఓటీటీలో వచ్చినా కూడా జనాలందరూమెచ్చేశారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు కలర్ ఫోటోను తెగ కీర్తించేశారు. స్టార్ హీరోలు కలర్ ఫోటో టీంను స్పెషల్‌గా అభినందించారు. అలాంటి కలర్ ఫోటో సినిమాతో అందరికీ సమాన ఆదరణ దక్కినా కూడా హీరోయిన్ పేరు మాత్రం ఎక్కువగా వినిపించింది. అందంగా కనిపించడమే కాదు.. అద్భుతంగా నటించేసింది కూడా. అలా తనకు అంత మంచి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడికి చాందినీ చౌదరి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పారు. అయితే నేడు బర్త్ డే. ఈ సందర్భంగా దర్శకుడిపై ఉన్న ప్రేమను చాందినీ బయటపెట్టేశారు. ఎంతో ప్రియమైన సందీప్ రాజ్‌కు హ్యాపీ బర్త్ డే. కలర్ ఫోటో సినిమాకు వెనుకున్న బలం ఈయనే. నువ్ నా జీవితంలోకి వచ్చినందుకు నేను ఎంతో లక్కీ. ఇంకా నీ స్టోరీలు చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను..నువ్వొక తుపాను అంటూ సందీప్ మీద తన ప్రేమను చూపించారు. సందీప్ రాజ్ తన రెండో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేశారని ఆ మధ్య వార్తలు వచ్చేశాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cYh0TH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...