Tuesday, 1 June 2021

RRR: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఎంట్రీ సాంగ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఏంటి.. ఏకంగా అన్ని రోజులా!

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ షురూ చేశారో అప్పటినుంచి జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ఆ ఇద్దరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది? అనే దానిపై చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో , రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్‌ గురించిన ఓ అప్‌డేట్ జనాల్లో యమ క్రేజీగా మారింది. చాలా కాలంగా షూటింగ్ RRR చేస్తున్న జక్కన్న.. కేవలం రెండు పాటల చిత్రీకరణ మినహా అంతా ఫినిష్ చేశారట. మిగిలిన ఈ పార్ట్ పూర్తి చేయడానికి కనీసం 45 నుంచి 50 రోజుల వరకు సమయం పడుతుందట. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్‌ ఉందని, ఆ ఒక్క పాట పూర్తి కావడానికే కనీసం 30రోజులు పడుతుందని సమాచారం. విజువల్ వండర్‌లా ఉండేలా ఈ సాంగ్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక మరో పాట , అలియాభట్‌ జోడీపై షూట్ చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగ్‌ మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇకపోతే కొమరంభీమ్ క్యారెక్టర్‌లో తారక్‌ కంటతడి పెట్టిస్తారంటూ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. చిత్రంలో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pcyDnM
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...