పవర్ స్టార్ పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారు.. సినిమా పరంగా ఫుల్ యాక్టివ్ మోడ్‌లో ఉన్నారు. కరోనా సోకి ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ వరస సినిమాలను లైన్‌లో పెట్టారు. వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరహర వీరమల్లు’ చిత్రాన్ని చేస్తున్నారు. బందిపోటు వీరోచిత గాథను విజువల్ వండర్‌గా చూపించబోతున్నారు క్రిష్. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రోల్‌కి సంబంధించి ఆసక్తికరమైన చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపక్ అవుతోంది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కితున్న ఈ చిత్రంలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఒకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న బందిపోటు పాత్ర కాగా.. మిగిలిన రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగామారింది. కాగా పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’తో పాటు మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్, గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్‌తో వరుస సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటుగా ‘వకీల్ సాబ్’ చిత్రం సీక్వెల్, ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మతో సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yVDkXc
v
No comments:
Post a Comment