హీరోగానే చేస్తాను అని పట్టుపట్టి కూర్చొకుండా పాత్ర మంచిదైతే దానిలో పరకాయ ప్రవేశం చేయడానికి వెనుకాడని నటుడు . విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఆయన చనిపోవడం సినిమా ఇండస్ట్రీ కి తీరని లోటుగా మిగిలింది. ఆయనతో ఉన్న అనుబంధం గురించి, ఆయన ఔన్నత్యాన్ని ఎంతోమంది నటులు సందర్భం చిక్కినప్పుడల్లా వివరించారు. ఇప్పుడు సీనియర్ నటుడు వంతు వచ్చింది. ఈటీవీ ఈ వారం ప్రసారం చేయబోయే క్యాష్ షో ప్రోమో ఇంతకుముందే విడుదల కాగా, ఆ ప్రోమో లో భాగంగా శ్రీహరి గురించి ఒక ఆసక్తికరమైన అంశం పంచుకున్నారు. శ్రీహరి క్యారెక్టర్ ఎలాంటిదో చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఇంటిముందుకు ఎవరైనా సహాయం కోసమని వెళ్తే, రాళ్ళకి డబ్బులు చుట్టి, దానికి గుడ్డలు చుట్టి విసిరేవాడని.. అవి తీసుకున్న జనాలు ఆయనకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్ళిపోయేవారని, ఈ రకంగా ఆయన కొన్ని వేలమందికి సహాయ పడ్డాడు అంటూ శ్రీహరి వ్యక్తిత్వం గురించి వివరించారు పృథ్వి. ఈ వారం ప్రసారమయ్యే కాష్ షో లో దీని గురించి మరింత వివరంగా తెలిసే అవకాశం కనిపిస్తోంది. పృథ్వితో పాటు సుదర్శనం, జ్యోతి, బెనర్జీలు కూడా ఈ వారం క్యాష్ షోలో అతిధులుగా విచ్చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pAi70T
v
No comments:
Post a Comment