Monday, 7 June 2021

'సాహో' బ్యూటీ సీక్రెట్ మ్యారేజ్.. పెళ్లి తర్వాత భర్తపై అలాంటి కామెంట్స్ చేసి షాకిచ్చిన హీరోయిన్

లాక్‌డౌన్ సినీ ఇండస్ట్రీల్లో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. వరుసపెట్టి సినీ తారలు పెళ్లి పీటలెక్కేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా బుల్లితెర నటీనటులు సైతం ఈ లాక్‌డౌన్ సమయాన్ని తన వివాహ బంధం కోసం వాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో ఎంతోమంది సినీ తారలు చేరగా తాజాగా 'సాహో' బ్యూటీ, బాలీవుడ్ హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా ఓపెన్ అవుతూ తన భర్తపై కామెంట్స్ చేసింది. మోడల్‌గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించింది ఎవ‌లిన్ శ‌ర్మ. ఆ తర్వాత ఆమెకు ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' సినిమాలో నటించే అవకాశం రావడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా చేస్తున్న టైమ్ లోనే ప్రభాస్ అంటే తనకు ఇష్టమని పేర్కొంటూ హల్చల్ చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత 2019లో త‌న బెస్ట్ ఫ్రెండ్, ఆస్ట్రేలియాకు చెందిన తుషార్ బిండితో ఎంగేజ్మెంట్ చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే ఎంగేజ్మెంట్ జరిగి రెండేళ్లవుతున్నా.. పెళ్లి కాకపోవడంతో వీరి మ్యారేజ్‌పై అందరిలో అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సీక్రెట్‌గా అతన్ని పెళ్లాడింది ఎవ‌లిన్ శ‌ర్మ. ఆ విషయాన్ని కొన్ని రోజులు దాచి ఉంచి ఇప్పుడు బయటపెట్టింది. ఆస్ట్రేలియాలో నిరాడంబరంగా తమ పెళ్లి వేడుక జరిగినట్లు ఆమె తెలిపింది. ‘‘బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవ‌డం కంటే మంచి విషయం ఇంకేముంటుంది. వైవాహిక జీవితంలో అడుగు పెట్టినందుకు ఎగ్జ‌యిట్‌గా ఫీల్ అవుతున్నాం’’ అని పేర్కొంది ఎవ‌లిన్ శ‌ర్మ. తుషాన్ ఎంతో శక్తివంతుడని, తనను ఎంతగానో ఇష్టపడే వ్యక్తి అని ఎవ‌లిన్ చెప్పింది. 'నన్ను అభిమానించే వ్యక్తే నాకు భర్తగా దొరికాడు. ఇప్పుడు నాకోసం ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా' అంటూ పెళ్లి తర్వాత తన భర్త గురించి ఎవ‌లిన్ శ‌ర్మ కామెంట్స్ చేయడం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3z63LtB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...