Friday, 18 June 2021

Niharika Konidela : ఆ ఒక్క విషయంలోనే అలా.. నాగబాబుపై నిహారిక కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారికలు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. మీమర్స్, ట్రోలర్స్‌కు తన స్టైల్లో సమాధానాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం నాగబాబుకు బుల్లితెరపై ఎలాంటి ఆఫర్లు లేవు. ఆయన సంపాదన అంతా కూడా సోషల్ మీడియా ద్వారానే వస్తోంది. యూట్యూబ్ చానెల్‌లో నాగబాబు షేర్ చేసే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఈ మధ్య సెలెబ్రిటీలు ఇంటి పట్టునే ఉంటూ ప్రకటనల్లో నటించేస్తున్నారు. అలా తాజాగా నాగబాబు, నిహారికలు కలిసి మొట్ట మొదటిసారిగా ఓ యాడ్‌లో నటించారు. ఈ మేరకు షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. పర్సనల్ విషయాలు చెబుతూనే యాడ్‌ను ప్రమోట్ చేశారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవల గురించి ఉద్దేశించిన ఈ యాడ్‌లో నాగబాబు, నిహారికలు అందరినీ కట్టిపడేస్తున్నారు. ఈ మేరకు తన తండ్రి నాగబాబు గురించి నిహారిక ఇలా చెప్పుకొచ్చారు. ‘చిన్నప్పటి నుంచి నాన్న నాకు రక్షణ కవచంలా ఉన్నారు.. నటుడిగా, నిర్మాతగా, రైటర్‌గా ఇంకా నా తండ్రిగా ప్రతీ రోజూ నన్ను ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. జీవితంలో అన్ని పాత్రలను విజయవంతంగా పోషించారు. ఒక్క ఆన్ లైన్ ట్రాన్స్‌యాక్షన్స్ తప్పా. నీహా ఈ అకౌంట్ నంబర్ చూడు.. ఇది అయిపోయింది కదా?. అప్పుడు నేను నవ్వుతూ చెప్పా.. ఇంకా ఈ డీటెయిల్స్ అవసరం లేదు.. మీ దగ్గర వాళ్ల ఫోన్ నంబర్స్ ఉన్నాయా?’ అంటూ ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ గురించి ఇద్దరూ ప్రమోట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHHZnv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...