Friday, 18 June 2021

జోరు మీదున్న ఆది సాయికుమార్.. ప్రెస్టీజియస్ మూవీలో భాగం కాబోతున్న సునీల్

జయాపజయాల సంగతి పక్కనబెట్టి డిఫరెంట్ స్టోరీలకు కమిటవుతున్నారు యంగ్ హీరో . 'ప్రేమ కావాలి' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ఆయన.. వరుస సినిమాలతో ఫామ్ కొనసాగిస్తున్నారు. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు పోషిస్తూ పటిష్టమైన కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఆది.. రీసెంట్‌గా ఓ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌గా మ‌రో రెండు సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇవే గాక తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశారు. ‘నాటకం’ చిత్రాన్ని రూపొందించిన క‌ళ్యాణ్ జీ గోగ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కాబోతున్న కొత్త సినిమాలో ఆది సాయి కుమార్ హీరోగా నటించబోతున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించ‌నున్నారు. ఇక ఈ ప్రెస్టీజియస్ మూవీలో కమెడియన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మూవీ టైటిల్, హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ నచ్చడంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నానని నిర్మాత నాగం తిరుపతి రెడ్డి అన్నారు. విజన్ సినిమాస్ పతాకంపై ఆది సాయికుమార్ హీరోగా సినిమా చేయ‌డం చాలా సంతోషంగా ఉందని, గతంలో చూడని డిఫరెంట్ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ఆయన చెప్పారు. ఈ మూవీలో సునీల్ రోల్ చాలా కీలకం అని, అడ‌గ్గానే ఆయ‌న న‌టించ‌డానికి ఒప్పుకున్నందుకు స్పెష‌ల్ థాంక్స్‌ అని నిర్మాత తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zAgTap
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...